Pages

నేరం ఏమిటని...

Tuesday, 2 June 2015
       

                                                       నేరం  ఏమిటని... 


మనిషికి మనసే శాపమైతే 
మనుగడ కష్టం... 

ఇష్టంగా బ్రకాల్సిన జీవితం,భారమైతె 
మనుగడ వ్యర్ధం... 

సర్దుకుపోవటంలో అభిమానం తలవంచుతుంటే 
మనుగడ నరకం... 

మనిషి జీవితం ఇదే అయితే 
మనుగడ శూన్యం... 

ఇందులో,నా నేరం ఏమిటని... 


                                        - అను మిట్టసల. 

Read more ...

తమ్ముడు..!

Sunday, 1 June 2014


                                       తమ్ముడు..!             


తోడబుట్టని తోబుట్టువు 
పుష్కరం ఆలస్యంగా నా జీవితంలోకి ప్రవేసించాడు 
కపటం లేని మాటలు 
కల్మషం లేని మనస్సు...తన సొంతం 
బాధ్యతలు ఎరిగిన బాలుడు 
నిలువెత్తు ప్రేమ పంచె పసివాడు 
మొండిగా కనిపించే ఓ వెండికొండ 
వాలే ప్రొద్దు...వేకువ సూర్యుడు...ఎప్పుడు ప్రేమే 
అలాగే ఆ తమ్ముడికి ఈ అక్కంటే 
అన్నతమ్ముల ప్రేమ,అభిమానం,బాధ్యత
                                 - అక్కచేల్లెలకే తెలుసు 
జీవితమనే చిత్రపటంలోని అపురూపమైన రంగుల్లో 
ఎప్పటికి వెలసిపోని ఓ రంగు - నా తమ్ముడు 
అపురూపంగా అల్లుకున్న బంధం,
వెలకట్టలేని ఓ అనుబంధం 
ప్రాణం పోయిన వీడకుంటే 
మరో జన్మలో - రక్తబందంతో తోడుగా పుడతా...  

                                                        - అను మిట్టసల. 

Read more ...

మనస్సు పలికే..!

Wednesday, 4 September 2013

                                                   మనస్సు పలికే..!
 
మనిషి మనుగడ కోసం రాజిపడ్డ ప్రతి సారి 
మనస్సు అనాధగా మిగుల్తూనే ఉంది... 
ముల్లును దాచుకున్న మనసు 
అనుక్షణం సంతోషం పంచుతూనే ఉంది... 
గద్ద వర్షించే మేఘాన్ని దాటి ఎగిరినట్టు 
ఈ వేదనను దాటి వేల్లిపోవాలంటే... 
చేరవలసిన తీరం దూరంగా జరిగిపోతుంది 
దోసిట్లో నీరు నిలవదని తెలిసి 
దాచాలనే ప్రయత్నంలో ఓడిపోయ్యాను... 
నిశబ్దపు వాకిళ్ళలో హాయిగా పడుకోవాలనుంది
మరో ఉదయం చూడాలని లేదు... 
మరో చీకటిని తాకాలని లేదు... 
మరో లోకం కోరట్లేదు... 
మరో గాయం తట్టుకోలేదు... 
మరో  అదృష్టం కావాలనుకోవట్లేదు... 
ఏనాడు వినిపించని మనసు మాటలు... 
ఒంటరిగా మిగిలిన ఏకాంతంతో చెప్తుంది... 
ఇక సాగలేను నాకు విశ్రాంతి కావాలి అని... 
మనిషికి నాతో పనిలేదు... 
తన ప్రపంచంలోను స్థానం లేదు..!


                                                           -అను మిట్టసల.
 



Read more ...